తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. మంగళవారం కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్‌ అధికారులతో తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి డి విజన్‌కు రూ. 2 లక్షలు మంజూరు చేశామని, వెంటనే తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల మ రమ్మతు పనుల టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో డీఈలు రవీందర్‌, రవికుమార్‌, సంతోశ్‌, మనోహర్‌రావు, సందీప్‌, న రేందర్‌, రవికిరణ్‌  పాల్గొన్నారు. అలాగే కార్పొరేషన్‌ ఆవరణలో ఇంజినీరింగ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో రెండు నైట్‌ షెల్టర్లతోపాటు, ఆశానిలయం, లూయీస్‌ అంధుల పాఠశాలకు సరుకులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌, ఆర్‌ఎఫ్‌వో జీవీ నారాయణరా వు పాల్గొన్నారు. 16 వ డివిజన్‌లోని డీ మార్ట్‌  ఆవరణలో ఎం హరిబాబు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.