కరోనా సంక్షోభం కారణంగా కుంగిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దేశం నుంచి ఆగిపోయిన ఎగుమతులు మళ్లీ ప్రారంభం కావటానికి మరింత సమయం పడుతుందని అందుకు తగినట్లుగా సిద్ధం కావాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఎగుమతులు, దిగుమతుల రియలైజేషన్ పీరియడ్ ఇప్పుడు 9నెలలు ఉండగా ఈసారి 15నెలలకు పెరుగవచ్చని తెలిపింది. కేంద్ర రాష్ట్రాల ఆర్థిక స్తితిగతులను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని వేసింది. రాష్ట్రాలు తమ అవసరాల కోసం మరిన్ని అప్పుడు తీసుకొనేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. జీఎస్‌డీపీ విలువలో ౩౦శాతం వరకు అప్పులు తీసుకోవచ్చని సూచించింది.
రాష్ట్రాలకు ఆర్బీఐ వెసులుబాటు